శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (16:45 IST)

బుద్ధా వెంకన్నకు దేవినేని నెహ్రూ లీగల్ నోటీసులు: రఘువీరపై ఫైర్

మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఆటోబయోగ్రఫీలో 1988లో జరిగిన వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారని, ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వీటిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని పేర్కొంటూ కాంగ్రెస్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) బుద్ధాకు లీగల్ నోటీసులు పంపారు.  
 
1988లో జరిగిన వంగవీటి రంగా హత్య గురించి రాసిన వ్యాఖ్యలపై ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విజయవాడలో మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడుపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం బుద్ధా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వంగవీటి రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న నెహ్రూని పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబుపై విచారణ కోరడం ఎంతవరకు సమంజసం? అంటూ దేవినేని ప్రశ్నించారు. అప్పట్లోనే సీబీఐ విచారణకు ఆదేశించిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కేబినెట్‌లో రఘువీరా కూడా పనిచేశారనే విషయాన్ని గుర్తు చేశారు.