శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:25 IST)

రాజధానిపై తుది నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రిదే : దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న అంశంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తీసుకుంటారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవనేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఇదే అంశంపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందన్నారు. 
 
రాజధాని ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ బోర్డు ఏర్పాటుపై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన తెలిపారు. ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్‌ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉందన్నారు. దీని పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ స్పష్టం చేశారు.