Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (10:31 IST)

Widgets Magazine
chandrababu

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లిపోయేలా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా చేసుకుని రెచ్చిపోతున్నారు. 
 
ముఖ్యంగా, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయవద్దని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ సమస్యలను జాతీయ స్థాయి అజెండాగా మార్చామన్నారు. అలాగే ఏపీకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని, దీనిని హేతుబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలి... రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 
 
అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో 6 నెలలపాటు పార్లమెంటులో పోరాటం చేశామని గుర్తుచేశారు. తక్కువ మంది ఎంపీలతోనే ఆనాడు సభను స్తంభింపచేశామని, అన్యాయాన్ని ప్రతిఘటించామన్నారు. మనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం.. రాష్ట్రాభివృద్ధే మన లక్ష్యం అంటూ ఆయన పునరుద్ఘాటించారు. ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని, సభ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని అందరూ వినాలన్నారు. అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని, రెండు ప్రభుత్వాల మధ్య సమస్య ఇది అని చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chandrababu Tdp Mp's Parliament Bjp Centre

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ హయాంలో పెరిగిన మతకలహాలు... యూపీలోనే అధికం

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత దేశ ...

news

జమ్మూకాశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం- లాంగ్ లీవ్.. టర్కీలో హనీమూన్‌

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ...

news

టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి మృతి.. షాక్‌కు గురైన హరికృష్ణ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ ...

news

డెంగీ జ్వరంతో ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు ...

Widgets Magazine