శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:01 IST)

ఆ మూడు ప్రతిరోజు చేయండి.. వందేళ్ళు బతుకుతారు.. ఎవరు?

చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో మహాసత్సంగ్ కార్యక్రమం జరిగింది. జ్ఞానము, ధ్యానము, గానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు. 
 
వైవిధ్యమైన సృష్టి మనిషి ఆనందంగా ఉండడానికే అన్నారు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. విద్యా దానం ఎంతో గొప్పదని.. ప్రతి పాఠశాల దేవాలయంతో సమానమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను అధైర్యపడకుండా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మనిషికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.