గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (04:42 IST)

మీ పిల్లలను అమెరికా పంపించవద్దు నాయనా.. అలోక్ రెడ్డి తండ్రి ఆక్రోశం

అమెరికా బార్‌లో కాల్పుల ఘటనలో ఒక తెలుగువాడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తెలుగువాడు తృటిలో తప్పించుకున్నాడు. కుమారుడి శవాన్ని మాత్రమే చూసుకోవలసిన ఆ కుటుంబం కుప్పగూలిపోయింది. కాల్పులకు గురై గాయాలతో తప్పించుకున్న తమ కుమారుడి క్షేమం తెలుసుకుని ఊపిరి పీల్చుక

అమెరికా బార్‌లో కాల్పుల ఘటనలో ఒక తెలుగువాడు ప్రాణాలు కోల్పోయాడు. మరో తెలుగువాడు తృటిలో తప్పించుకున్నాడు. కుమారుడి శవాన్ని మాత్రమే చూసుకోవలసిన ఆ కుటుంబం కుప్పగూలిపోయింది. కాల్పులకు గురై గాయాలతో తప్పించుకున్న తమ కుమారుడి క్షేమం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న మరొక కుటుంబం కూడా తల్లడిల్లుతోంది. వాళ్లకు ప్రపంచ రాజకీయాలు పెద్దగా తెలీవు. తమ తనయులపై దాడులకు ఎవరు కారణమే, తమ పిల్లలు అమెరికాలో ఎవరికి అంత అన్యాయం తలపెట్టారో కూడా ఈ కుటుంబ పెద్దకు తెలియదు. కానీ అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే భారతీయులపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్న ఎరుక మాత్రం ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను అమెరికా పంపించొద్దని అలోక్ రెడ్డి తండ్రి మేడసాని జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థిస్తున్నారు. 
 
మొత్తం మీద ఒక సత్యం అర్థమవుతోంది. బానిస వ్యవస్థను అమెరికా గడ్డపై శాశ్వతంగా కొనసాగించాలని తరతమభేదాల జాతి వివక్షను భూమి ఉన్నంతవరకు అమెరికాలో స్థిరపర్చాలని కంకణం కట్టుకున్న బానిస యజమానులకు కూడా సాధ్యం కాని పనిని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాదించాడు. తమదైన నిర్వచనంలో స్వేచ్చా స్వాతంత్ర్యాలకు నిలువెత్తు శిఖరంలా నిలబడిన అమెరికాను ట్రంప్ ఇవ్వాళ రంగుభేదం కలవారి మధ్య యుద్ధభూమిగా మార్చేశాడు. బానిస యజమానులకే సాధ్యం కాని విజయం సాధించేశాడు.
 
సాఫ్ట్ వేర్, ఐటీ విప్లవాలు పురికొల్పిన క్రమంలో వలసబాట పట్టిన భారతీయులు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా అంటే భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ ఏ క్షణంలో తుపాకి గండు పేలుతుందో, మాటల యుద్ధం పెరిగి గుళ్లవర్షం కురుస్తుందో తెలీన అనంత అభద్రతా భావంలో భారత సంతతి అమెరికన్లు వణుకుతున్నారు. మీ కంటే మేధావులు లేరా, మా దేశానికి మా మేధస్సు పనికిరాదా, మా గడ్డపై మా ఉద్యోగాలు మీ సొంతమవుతాయా కబడ్డార్ అంటూ దేశాధ్యక్షుడి గార్దభస్వరం సంధిస్తున్న మాటల బాణాలు ఎవరి చేతిలో ఆయుధాలవుతాయో తెలీని స్థితి, ఈ గుళ్ల వర్షాలు ఇంకా ఎంత విస్తృతస్థాయికి పెరుగుతాయో తెలీనిస్థితి.  
 
మరోవైపు బిడ్డలను పోగొట్టుకుంటున్న కుటుంబ పెద్దలు ఇకపై పిల్లల్ని అమెరికాకు పంపనే వద్దని ఇతరులను వేడుకుంటున్నారు. 
 
ఒకటి మాత్రం నిజం.. యూరప్‌ని కమ్యూనిజం భూతం ఆవహించిందన్నాడు 165 ఏళ్ల క్రితం కారల్ మార్స్స్. అదెంతవరకు నిజమో కానీ.. ఇప్పుడు అమెరికాను అక్షరాలా ఆవహించిన భూతం డొనాల్డ్ ట్రంప్