బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: శుక్రవారం, 19 డిశెంబరు 2014 (22:17 IST)

24 నుంచి ‘ద్వాదశి’ దర్శన టికెట్టు : టీటీడీ ఈవో

ద్వాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలకునే వారికి ఈ నెల 24 నుంచి టికెట్లు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసుకుంటోంది. సాదారణంగా అయితే ప్రత్యేక దర్శనాన్ని 29 నుంచే నిలిపేసినప్పటికీ ఆన్ లైన్ విధానంంలో టికెట్లు పొందేవారికి కూడా ఈ అవకాశం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో డి.సాంబశివరావు తెలిపారు. 
 
శుక్రవారం తిరుమలలో టిటిడి విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లపై చర్చించినట్లు చెప్పారు. వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడనున్నట్లు వివరించారు. అదే సమయంలో ఏకాదశి నాడు కైంకార్యాలు కూడా ఉంటాయని, అదే సమయంలో జనవరి 1 తేదీ కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కనీసం 70 వేల మందికి చేయించగలగులుతామన్నారు. 
 
ద్వాదశి రోజున వైకుంఠ దర్శనం చేసుకోవడానికి 10 వేల ఆన్ లైన్ టెకెట్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొంద దలుచుకున్న వారు ఈ నెల 24 నుంచి ఇంటర్నట్ ద్వారా బుకింగ్ చేసుకోెవచ్చునని చెప్పారు. విఐపిల వెంట కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. వారు కూడా పరిస్థితి అనుసరించి వ్యవహరించుకోవాలని కోరారు.