మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (17:32 IST)

మంత్రి పరిటాల సునీత వాహనంపై చెప్పులు... ఎక్కడ?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్న మహిళా మంత్రుల్లో పరిటాల సునీత ఒకరు. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, ఇక్కడ ఆదివారం జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వాహనంపై చెప్పులు పడ్డాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని తమను మోసం చేశారంటూ కొందరు రైతులు నిరసన వ్యక్తంచేశారు. అంతేనా, ఆమె వాహనంతోపై చెప్పులు విసిరారు. దీంతో మంత్రి సునీత ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
 
రాప్తాడు మండలంలోని తోపుదుర్తిలో మంత్రి కాన్వాయ్‌ను డ్వాక్రా మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లుగా తమ గ్రామానికి ఏమీ చేయని మంత్రి సునీత ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
నిజానికి ఈ పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించినప్పటి నుంచి ఈ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. అయినా తెదేపా శ్రేణులు ఇవేమీ పట్టించుకోకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఇందులో మంత్రి పాల్గొన్నారు. 
 
అపుడు అనేక మంది గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. పరిటాల సునీతకు తమ గ్రామంలో తిరిగే అర్హత లేదంటూ నినాదాలు చేశారు. స్థానిక వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఆమె పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డ్వాక్రా మహిళలు రంగంలోకి దిగారు. నల్ల కర్చీఫ్‌లతో నిరసన తెలిపారు. 'సునీతమ్మ నిన్ను నమ్మం' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.