శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (13:41 IST)

జేఎన్‌టీయూలో ఈసెట్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది విడుదలైన అన్ని రకాల విద్యా సంబంధిత ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. తాజాగా జేఎన్టీయూలో ఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఈసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించినట్టు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈసెట్ అర్హత పొందిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంతో నేరుగా చేరవచ్చని తెలిపారు. జూన్ 12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టుగాను, ఆ తర్వాతనే ఈసెట్ ఆడ్మిషన్లు ఉంటాయని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన ర్యాంకు కార్డులను మే నెల 25 నుంచి ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విజయ్ ప్రకాశ్ వెల్లడించారు.