శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (09:12 IST)

ఎంసెట్ కౌన్సెలింగ్ : కేసు సుప్రీంకోర్టులో ఉంది.. టీ సర్కారు!

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఉన్నత విద్యా మండలి నిర్ణయంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది. 
 
మరోవైపు.. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. ఈ నెల 31న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆగస్టు 7న సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. దీంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు. వాయిదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ర్యాంకులు ప్రకటించి దాదాపు ఒకటిన్నర మాసం గడుస్తున్నప్పటికి కౌన్సెలింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలకు  స్పష్టత లేకపోవడం వల్ల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చింది. 
 
విద్యార్థులు కౌన్సెలింగ్‌ కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులకు సరైన సమయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఇరు రాష్ట్రాల ఉన్నత విద్యామండలి ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈనెల 31న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, మెడిసన్‌ కోర్సుల్లో ప్రవేశం కోరే విద్యార్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.