శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 జులై 2014 (20:18 IST)

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 7 నుండి 23 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 57 కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఒకటి నుంచి ఐదు వేల ర్యాంక్ లోపు వారి సర్టిఫికెట్లను మొదటి రోజు పరిశీలిస్తారు. 
 
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు 2,15, 336 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా, ఉన్నత విద్యా మండలి విడుదల చేసే నోటిఫికేషన్‌తో తమకు సంబంధం లేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే 'ఫాస్ట్' పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని నియమించింది. 
 
స్థానిక నిర్ధారించే ధృవపత్రాలను రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి 'ఫైనాన్పియల్ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్(ఫాస్ట్)' పేరుతో కొత్త స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.