మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:44 IST)

నిన్ను మరిచిపోలేనురా.... భర్తను చంపి జైలుకెళ్తా.. బెయిలుపై విడిపించు... కన్నింగ్ లేడీ

ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది. తనకు ఇద్దరు పిల్లలున్నారన్న విచక్షణ కూడా లేకుండా కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి, ఆపై దిండుతో ముఖాన్ని అదిమిపట్టి చంపేసింది. ఆ తర్వాత జైలు

ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది. తనకు ఇద్దరు పిల్లలున్నారన్న విచక్షణ కూడా లేకుండా కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి, ఆపై దిండుతో ముఖాన్ని అదిమిపట్టి చంపేసింది. ఆ తర్వాత జైలుకెళ్లింది. అయితే, ఆమె గుట్టును శవపరీక్ష రిపోర్టు బట్టబయలు చేసింది.
 
ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని తోటవారి పల్లెకు చెందిన రాంబాబు - ప్రియదర్శిని అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 17 యేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 26వ తేదీన రాంబాబు అనుమానాస్పదరీతిలో చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఈ కేసులోని నిజాన్ని బహిర్గతం చేసింది. ప్రియుడితో కలిసి ఓ కన్నింగ్ ఇల్లాలు కట్టుకున్న భర్తను హత్య చేసింది. 17 రోజుల తర్వాత ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. కన్నింగ్ వైఫ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అసలు విషయం వెల్లడించింది. 
 
రాంబాబు భార్య ప్రియదర్శినికి శివసాయి కిశోర్ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇచ్చే శారీరక సుఖం కంటే.. ప్రియుడిచ్చే శారీరక సుఖానికి బానిసైంది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తన ప్రియుడితో కలిసి చెన్నైకు పారిపోయింది. ఆ తర్వాత రాంబాబు... పోలీసుల సాయంతో భార్యను తిరిగి వెనక్కి పిలిపించుకున్నాడు. 
 
అప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు. ఇంటికి వచ్చాక.. ఫేస్‌బుక్ అందిస్తున్న మెసెంజర్ యాప్ ద్వారా కిశోర్‌తో టచ్‌లో ఉంటూ వచ్చిన ప్రియదర్శిని.. తన మనసులోని ప్లాన్‌ను చెప్పింది. ఇందులోభాగంగా, గత నెల 26న కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇవ్వగా, రాంబాబు మత్తులోకి జారుకున్నాడు. ఆ సమయంలో అతని ముఖానికి దిండును గట్టిగా అదిమి ప్రియదర్శిని, శివసాయి కిశోర్ కలసి హత్య చేశారు. 
 
ఆపై హత్యను తానే చేశానని చెప్పి లొంగిపోతానని, జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్‌పై విడిపించాలని కిశోర్‌కు చెప్పి.. అతనికి రూ.2 లక్షలిచ్చి పంపించివేసింది. అక్కడిదాకా ఆమె అనుకున్నట్టుగానే జరిగింది. కానీ, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం తేలింది. ఈ రిపోర్టు తర్వాత ప్రియదర్శిని వద్ద తమదైనశైలిలో పోలీసులు విచారించారు. దీంతో ప్రియుడితో ప్రేమాయణం మొదలు హత్యకు ఎలా ప్లాన్ చేశానన్న విషయం వరకూ మొత్తం పూస గుచ్చినట్టు నిందితురాలు వెల్లడించింది. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.