శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (21:14 IST)

ఇచ్చట పిల్లలను అమ్మబడును..! రూ. 3 లక్షలకు బేరం పెట్టిన స్వచ్ఛంద సంస్థ

పేరు విద్యను విస్తరించే స్వచ్ఛంద సంస్థ. చేసేది నీచమైన వ్యాపారం. చిన్న పిల్లలను తల్లుల నుంచి వేరు చేసి అమ్మే కసాయి వ్యాపారం. ఆంధ్రాకు చెందిన ఏలూరులోని సంస్థ నిర్వాకం బయట పడింది. స్టింగ్ ఆపరేషన్ చేసిన పోలీసులు పిల్లలు లేని తల్లిదండ్రుల తరహాలో వెళ్లి ఓ బిడ్డను కొనుగోలుకు చిన్న పిల్లలను అమ్మే విషయాన్ని గుట్టు రట్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. 
 
స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోంది. చిన్న పిల్లలను సేకరించి అమ్మకానికి పెడుతుండేవారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తల్లిదండ్రుల వేషంలో వచ్చారు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురంలో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీతో బేరానికి దిగారు. 
 
తమకు పిల్లలు లేరని.. ఓ పసిబిడ్డ కావాలని విన్నవించారు. అందుకు అంగీకరించిన సంస్థ నిర్వాహకుడు రవిప్రకాశ్ ఓ ఆరు నెలల బిడ్డను మూడు లక్షల రూపాయలకు బేరం పెట్టాడు. దీంతో పోలీసుల వ్యూహం ఫలించి అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.