శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (08:35 IST)

మళ్లీ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ లేదా వైకాపాలో చేరిక?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేంద

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపినట్టు సమాచారం. ఈ చర్చలు ఫలప్రదం కానిపక్షంలో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచాం. ఏదిఏమైనా ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. 
 
కాగా, నాడు విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన, చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్న ఆయన తిరిగి రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఆయన అభిమానుల్లో ఆనందోత్సవాలను నింపుతోంది.