Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సరిహద్దుల్లో చేసే యుద్ధం కంటే.. ఏపీలో భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉంది!

సోమవారం, 19 జూన్ 2017 (14:47 IST)

Widgets Magazine
Ex-servicemen

ప్రభుత్వం కేటాయించిన భూమిని కాపాడుకునేందుకు ఓ మాజీ సైనికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అధికారులతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో శత్రుసైన్యంతో చేసే యుద్ధం కంటే... సొంతూరులో ప్రభుత్వం కేటాయించిన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుకునేందుకు చేస్తున్న యుద్ధమే కష్టంగా ఉందని వాపోతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంకు చెందిన మేడికొండ ఆదాం అనే వ్యక్తి 1961–62 నుంచి 1975 వరకు ఇండియన్ ఆర్మీలో పని చేశాడు. ఆయన 1962లో చైనాతో, 1965, 1971 పాకిస్థాన్‌‌తో జరిగిన యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. 15 యేళ్ళ  సర్వీసు ముగిసిన తర్వాత స్వచ్చంద విరమణ తీసుకున్నారు. 
 
ఈ సమయంలో సాగుచేసుకునేందుకు భూమి కావాలని అర్జీ పెట్టుకోవడంతో ప్రభుత్వం పట్టించుకోలేదు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి జీవనోపాధికి భూమి కేటాయించాలని కోరడంతో ఆయన ఆదేశాలమేరకు అధికారులు వెల్లటూరు పరిసరాల్లో 4.50 ఎకరాలు సర్వే చేసి హద్దులు చూపారు. అయితే, ఈ భూమిని సాగుచేయడం లేదన్న కారణంతో భూమి రికార్డులను మార్చి ఆక్రమించుకునేందుకు కొందరు పావులు కదుపుతున్నారు.
 
ఈ భూములను కాపాడుకునేందుకు ఆయన నాలుగున్నరేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడంతో లేదని ఆయన చెప్పారు. సరిహద్దుల్లో పోరాటం కంటే ఈ భూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం చాలా కష్టంగా ఉందని ఆయన వాపోయారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీ కురువృద్ధుడి శకం ముగిసినట్టే : రాష్ట్రపతి అభ్యర్థిగా దళితనేత రామ్‌నాథ్ కోవింద్

భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి మరోమారు శృంగభంగమైంది. ఎన్డీయే కూటమి తరపున ...

news

విచ్చలవిడి మహిళ... ముగ్గురు మొగుళ్లు... ఇద్దరితో అక్రమ సంబంధం...

ఆమె జీవితం విచ్చలవిడిగా మారిపోయింది. గుంటూరుకు చెందిన మహిత అనే మహిళ ముగ్గురు భర్తలను ...

news

పూర్తిగా వాడేసుకున్నాడు.. పెళ్లి మాటెత్తగానే ఉలిక్కిపడ్డాడు... ప్రియురాలు కత్తిపీటతో ఏం చేసిందో తెలుసా?

తనను అన్ని విధాలుగా వాడుకుని, చివరకు పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ...

news

వ్యాన్ ఇంజిన్‌లో నాగుపాము.. పది అడుగుల పొడవు.. 5 కిలోల బరువు.. ఏం చేసిందంటే? (వీడియో)

మినీ వ్యాన్ ఇంజిన్‌లో నాగుపాము కనిపించింది. అంతే కారు ఓనర్‌తో పాటు అందరూ జడుసుకున్నారు. ...

Widgets Magazine