Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమికులూ... విశాఖ బీచ్, పార్కులకు వెళ్లకండి.. నకిలీ పోలీసులున్నారు జాగ్రత్త!

శనివారం, 3 జూన్ 2017 (14:47 IST)

Widgets Magazine
lovers romance

ప్రేమికులు పార్కుల వెంట, బీచ్‌ల వెంట తిరిగుతున్నప్పుడు  జాగ్రత్త పడాలి ఎందుకంటే నకిలీ పోలీసులున్నారు. విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో వున్న తొట్లకొండపై నకిలీ పోలీసులు ఓ ప్రేమ జంట పట్ల ఓవరాక్షన్ చేశారు. డబ్బు గుంజుకున్నారు. రిస్ట్ వాచ్ నొక్కేశారు. అంతటితో ఆగకుండా యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ నుంచి శుక్రవారం మధ్యాహ్నం తొట్లకొండపై కాలక్షేపం చేసేందుకు ఓ జంట వచ్చింది. సాయంత్రం కావస్తుండడంతో వెళ్లిపోవాలంటూ బీచ్‌ పోలీసులు సందర్శకులను హెచ్చరించారు. కాసేపటికే ఐదుగురు వ్యక్తులు ఆ జంట వద్దకు వచ్చారు. సెల్‌ఫోనులో ఫోటోలు తీశారు. పోలీసు స్టేషన్‌కు రమ్మని బెదిరించారు. ప్రేమికుడైన ఆ యువకుడు వైద్య వృత్తి అని తెలుసుకున్నాక ఆ ఐదుగురు రూ.లక్ష ఇస్తేనే విడిచిపెడతామన్నారు. 
 
తన బ్యాంక్ అకౌంట్లో రూ.10వేలున్నాయనడంతో కారులో వారిని ఎక్కించుకుని ఏటీఎం నుంచి డ్రా చేయించుకుని నొక్కేశారు. యువకుడి చేతికున్న వాచ్‌కు లాక్కున్నారు. ఆపై యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం సెజ్ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకర్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం ...

news

అలా మాట్లాడితే రోజా నాలుక కోస్తాం... ఎవరు..?(video)

వైసిపి ఎమ్మెల్యే రోజా హిందూ వ్యతిరేకిగా మారారని మండిపడ్డారు శివసేన పార్టీ చిత్తూరు జిల్లా ...

news

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ ...

news

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక ...

Widgets Magazine