మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 3 మే 2016 (16:45 IST)

గుడిలో కేసీఆర్ విగ్రహం ఏర్పాటు... పథకాలకు చంద్రన్న పేరు లింకులు... ఏంటో ఇది...

నిజామాబాద్ జిల్లాలో కట్టిన గుడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. బ్రతికుండగానే విగ్రహాలు ఏర్పాటు చేయటం రాజకీయాల్లో చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి యూపీ-ఢిల్లో బోర్డర్లో ముఖ్యమంత్రిగా ఉండగా తనకు తాన

నిజామాబాద్ జిల్లాలో కట్టిన గుడిలో తెలంగాణ సీఎం కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. బ్రతికుండగానే విగ్రహాలు ఏర్పాటు చేయటం రాజకీయాల్లో చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి యూపీ-ఢిల్లో బోర్డర్లో ముఖ్యమంత్రిగా ఉండగా తనకు తాను ఆరువేల కోట్లతో గతంలో పార్క్ కట్టించుకున్నారు. ఆ పార్కులో బహుజన్ సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, ఆపార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలతో పాటు, మాయావతి తన విగ్రహాలను భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఇదో సంచలనం సృష్టించింది.
 
సాధారణంగా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకుల పేర్లు పెట్టటం ఆనవాయితీగా వ‌స్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అమ్మ క్యాంటీన్లు, అమ్మ మెడిసిన్ లాంటి పథకాలకు తన పేరు పెట్టుకున్నారు. సహజంగానే ప్రచార ఆర్భాటం పాళ్ళు ఎక్కువ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు అమ్మ తరహా ఆలోచన వచ్చింది. 
 
అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు మీద అన్న క్యాంటీన్లు, అన్న సుజల స్రవంతి పథాకాలకు తీసుకొస్తానన్న చంద్రబాబు మూడోసారి సీఎం అయ్యాక,  బ్రతికుండగానే తన పేరు మీద సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రన్న సంక్రాతి కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న సంచార వైద్యం, చంద్రన్న బీమా పథకాలు అమ‌లులోకి వ‌చ్చాయి.
 
ఎన్నికలు అంకం పూర్తయ్యాక పద్ధతిగా ఎన్టీఆర్ పేరును పక్కకు నెట్టేయటం చంద్రబాబుకు అలవాటేనని టీడీపీ సీనియర్ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో కూడా ఎన్నికల్లో ఓడిపోయాకే రామారావు ఫోటోను ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో చంద్రబాబు పెట్టించారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయో కాలమే సమాధానం చెప్తుంది.