శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 23 జులై 2016 (21:10 IST)

డీజీపీ రాముడుకు ఘనంగా వీడ్కోలు ప‌లికిన పోలీసు యంత్రాంగం

విజయవాడ: పదవీ విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడుకు పోలీసు యంత్రాంగం శ‌నివారం ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులంతా వీడ్కోలు కార్యక్రమానికి వచ్చి ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని పోల

విజయవాడ: పదవీ విరమణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ జేవీ రాముడుకు పోలీసు యంత్రాంగం శ‌నివారం ఘనంగా వీడ్కోలు పలికింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులంతా వీడ్కోలు కార్యక్రమానికి వచ్చి ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వీడ్కోలు పరేడ్‌లో నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు గౌరవందనం సమర్పించాయి. ఈ పరేడ్‌కు ఇంఛార్జి డీజీపీ ఎన్‌.సాంబశివరావు, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌నవాంగ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ కార్యదర్శి అనురాధ తదితరులు హాజరయ్యారు. 
 
నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి డీజీపీగా జేవీ రాముడు సేవలు అసమానమని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన జేవీ రాముడు.. ఏపీ పోలీసు విభాగం కీర్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని ఇంఛార్జి డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యానించారు. వనరుల కొరత, సిబ్బంది విభజనతో పాటు సౌకర్యాల్లేని పరిస్థితులను అధిగమించి.. పోలీసు శాఖ ముందుకు సాగిపోయే మార్గనిర్దేశాన్ని చేశారని ఆయన కొనియాడారు. 
 
అదేసమయంలో పోలీసులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని.. సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖను ముందుకు తీసుకెళ్లటంలో సీనియర్‌ పోలీసు అధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అంతా సహకరించారని పదవీ విరమణ చేస్తున్న డీజీపీ జేవీరాముడు తెలిపారు.