మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (06:34 IST)

ఏనుగులు బాబోయ్.. ఏనుగులు..!! దాడిలో మరో రైతు మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామాల సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. గురువారం ఫారెస్టు వాచర్ ను చంపేసిన ఏనుగులు శుక్రవారం మరో రైతుపై దాడి చేసి తొక్కి చంపేశాయి. కుప్పం ప్రాంతంలో జరుగుతున్న ఈ ఏనుగుల దాడితో జనం బెంబేలెత్తిపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఏనుగుల దాడిలో అటవీశాఖ లైన్‌వాచర్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గం వికోట మండలం కారగల్లు మరో రైతు శుక్రవారం మృత్యువాత పడ్డాడు. చంద్రానాయుడు అనే రైతు పొలంలో వద్దకు వెళ్ళాడు. కాపలా కాస్తు సంచరిస్తున్న ఏనుగులను తరిమేందుకు ప్రయత్నం చేశాడు. 
 
గ్రామస్తులతో కలసి వాటిని తరుముతుండగా మదమెక్కిన ఏనుగు ఒకటి తిరిగబడి చంద్రనాయుడుపై దాడి చేసింది. అదే ఏనుగు గురువారం అటవీ ఉద్యోగిని పొట్టన పెట్టుకుంది. అదే ఏనుగు చంద్రనాయుడును తొండంతో మోది చంపేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే తరహా ఘటన వరుసగా రెండోది చోటు చేసుకోవడంతో జిల్లాలో ఆందోళన రేకెత్తుతోంది.