గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:38 IST)

తండ్రి వయస్సున్న కామాంధుడు అత్యాచారం... వీడియో తీసి... ఆ తరువాత..?

సివిల్స్ రాసి కలెక్టర్ కావాలనుకుంది. పెళ్ళి చేసుకుని భర్తను ఒప్పించి హైదరాబాద్‌కు వచ్చి ఒంటరిగా ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆ మహిళపై కన్నేశాడు ఒక వృద్ధుడు. తండ్రి వయస్సున్న అతను ఆమెకు పార్ట్ టైం ఉద్యోగం ఇస్తానని ఇంటికి రమ్మని కూల్ డ్రింకులో మత్తు మందు కలిప

సివిల్స్ రాసి కలెక్టర్ కావాలనుకుంది. పెళ్ళి చేసుకుని భర్తను ఒప్పించి హైదరాబాద్‌కు వచ్చి ఒంటరిగా ఉంటోంది. ఒంటరిగా ఉన్న ఆ మహిళపై కన్నేశాడు ఒక వృద్ధుడు. తండ్రి వయస్సున్న అతను ఆమెకు పార్ట్ టైం ఉద్యోగం ఇస్తానని ఇంటికి రమ్మని కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఆ తరువాత అత్యాచారం చేశాడు. ఆ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశాడు. 
 
మరిన్ని వివరాలను చూస్తే... కర్నూలు నగరానికి చెందిన గీతకు సంవత్సరం క్రితం కళ్యాణ్‌ అనే వ్యక్తితో పెళ్ళయ్యింది. ఎలాగైనా కలెక్టర్ అవ్వాలన్న కోరిక ఆమెది. అందుకే భర్తను ఒప్పించి సివిల్స్ చదివేందుకు హైదరాబాద్‌కు వచ్చింది. తన స్నేహితురాలు తండ్రి జయకుమార్ సహాయంతో అపార్టుమెంట్‌లో బాడుగకు దిగింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే గీత ఒంటరిగా ఉండటంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని జయకుమార్ భావించాడు. సివిల్స్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చూసుకో నేను జాబ్ ఇస్తానంటూ తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. అక్కడకు రాగానే కూల్ డ్రింక్ ఇచ్చాడు.
 
కూల్ డ్రిండ్ తాగగానే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో గీతపై అత్యాచారం చేసి, ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించాడు జయకుమార్. విషయం బయటకు చెబితే వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. పిలిచినప్పుడల్లా తన ఫ్లాట్‌కు రావాలని బెదిరించాడు. ఇలా 10 నెలల పాటు నరకాన్ని అనుభవించింది గీత. తన భర్తకు విషయం చెప్పేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక మథనపడిపోయింది. 
 
జయకుమార్ ఆగడాలు మరింత పెరిగిపోయాయి. తనతో పాటు తన ఇద్దరు స్నేహితులను ఫ్లాట్‌కు తీసుకొచ్చి వారితో కూడా గడపమన్నాడు రాక్షసుడు. ఇలా మరో నెల గడిచింది. ఏం చేయాలో పాలుపోక చిత్రహింసలు అనుభవించింది. చివరకు కర్నూలుకు వెళ్ళి భర్తకు విషయం చెబుదామనుకుంది. భర్తకు విషయం చెబితే ఏం జరుగుతుందోనన్న భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గీత మొబైల్లో ఉన్న కాల్ డేటాను ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.