శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:53 IST)

మాంసం కోసం... ఘర్షణ... 17 మందికి గాయాలు.. ఎక్కడా?

పౌరుషాలు రాజ్యమేలుతున్న చోట ఘర్షణలకు, గొడవలకు ప్రత్యేక కారణాలు అవసరం లేదు. చెత్త, మట్టి, మాంసం ఏదైనా సరే.. సాకు దొరికితే చాలు కొట్టుకోవడానికి.. తిట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం మాంసం కోసం రెండు గ్రూపులు తెగబడ్డాయి. అట్టా ఇట్టా కాదు. కత్తులతో పొడుచుకుని, కొడవళ్లతో నరుక్కునే స్థాయి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం గోనంపల్లెలో ఆదివారం స్థానికులు గంగమ్మకు దున్నపోతును బలి ఇచ్చారు. మాంసం పంపకాల్లో రెండు వర్గాల మధ్య తేడా వచ్చింది. ఆ ఊరి సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రతి ఏడాది దున్నపోతులను బలి ఇస్తారు. ఆ క్రమంలోనే ఆదివారం కూడా బలి ఇచ్చారు. అయితే వాటి మాంసం పంపకాల్లో చిన్నపాటి గొడవ మొదలైంది. 
 
అది కాస్త పెద్దదై 17 మందికి గాయాలయ్యే పరిస్థితి దాకా వెళ్లింది. ఇలాంటి ఘటన ఎపుడూ జరగలేదని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.