శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 30 మార్చి 2015 (06:58 IST)

అనంతలో తెలుగు తమ్ముళ్ళు డిష్యూం.. డిష్యూం.. ఇద్దరికి గాయాలు

అధికార తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు కలియబడ్డారు.. కుర్చీలు విసురుకున్నారు... కొట్టుకున్నారు. రక్తాలు కారాయి.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇదంతా మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే జరిగింది. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు ఒకరిపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కొట్టకుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఆదివారం అనంతపురంలో అనంత అర్బన్‌ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం మొదలయ్యింది. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఆధ్వర్యంలో ప్రారంభమైన సమావేశానికి మంత్రి పల్లె హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతుండగా మేయర్ వర్గానికి చెందిన కొందరు కొందరు ప్రశ్నించారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో రెండువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలోనే కొట్టుకున్నారు. గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరికి రక్త గాయాలయ్యాయి.
 
దీంతో ఆగకుండా దాడిచేసిన వారిని అరెస్ట్‌ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. చివరకు వారిని అరెస్ట్‌ చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరీ, మేయర్‌ స్వరూప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి టీడీపీ కార్యకర్తలను సొంతపూచికత్తుపై బయటకు తీసుకొచ్చి నచ్చచెప్పారు. మంత్రి పల్లె, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ గొడవకు కారకులైన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు.