Widgets Magazine

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటుడు అభిషేక్‌ అరెస్టు.. విదేశీయులు కూడా...

మంగళవారం, 31 జనవరి 2017 (08:41 IST)

Widgets Magazine
abhishek

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, 'డేంజర్' వంటి చిత్రాల్లో నటించిన నటుడు అభిషేక్‌‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనతో పాటు మరో ఇద్దరు విదేశీయులు సహా ఆరుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కలిసి ఒక గ్రాము మత్తు పదార్థాన్ని 5 వేలకు విక్రయిస్తూ ఇదో గొలుసుకట్టు వ్యాపారంగా చేస్తూ వచ్చారు. వీరి వద్ద నుంచి 370 గ్రాముల మాదకద్రవ్యంతో పాటు.. రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అభిషేక్‌, మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు.. కొన్నేళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సంపన్నులనే లక్ష్యంగా చేసుకొని గొలుసుకట్టు వ్యాపారంగా కొకైన్‌ విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకంగా 5 వేల మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తూ వచ్చారు. 
 
ఈ వ్యవహారాన్ని పసిగట్టిన పోలీసులు వీరిపై ప్రత్యేకంగా నిఘా సారించింది. దీంతో అభిషేక్‌‌ను, ఇతర ఆరుగురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్‌, 12 సెల్‌ఫోన్లు, ఓ కారు, బైకు, రూ 46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తప్పతాగింది... కైపు తలకెక్కింది... బార్‌లో బుల్లితెర నటిపై దాడి

ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో ...

news

మరో వందేళ్లదాకా... హైదరాబాద్‌లో తాగునీటికి ఢోకా లేదు: నగరం చుట్టూ జలజలలు

నిజంగానే హైదరాబాద్ పంట పండింది. కాదు కాదు.. నీరు పండింది. నగరం చుట్టూ భారీ నీటి స్టోరేజీ ...

news

చెల్లెలు రంగంలోకి దిగితే అన్న గతేమిటి?

గత రెండు వారాలుగా ఉత్తరాది రాజకీయాల్లో జరిగిన రెండు ప్రముఖ ఘటనలు ప్రియాంకను ఒక్కసారిగా ...

news

డెల్టాను ఎండబెట్టారు.. రైతుల ఉసురు తీశారు.. మీరు మనిషేనా బాబూ: జగన్ ధ్వజం

కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన వైకాపా అధినేత వైఎస్‌ ...