Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజీవ్ నయవంచకుడు.. ఆ బాధతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందట: పోలీసులు

బుధవారం, 28 జూన్ 2017 (09:34 IST)

Widgets Magazine

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే రాజీవ్, శ్రవణ్, తేజస్వినిల వద్ద పోలీసులు విచారణ జరిపారు. శిరీష ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు. రాజీవ్‌తో అనుబంధంలో ఉన్న శిరీషకు కుక్కునూరుపల్లి వెళ్లిన తర్వాతే అతడి గురించిన నిజాలు తెలియవచ్చాయి. 
 
రాజీవ్ కోసం ఉన్న తనను ఎస్సై ప్రభాకర్‌కు కట్టబెట్టడంతో మనస్తాపం చెందిన శిరీష.. వాటిని తట్టుకోలేకే ఆత్మహత్యకుపాల్పడి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తేజస్వినితో వివాదం అనంతరం రాజీవ్ తనకు మరింత దగ్గరవుతాడని శిరీష భావించిందని, అందుకే రాజీవ్, శ్రవణ్‌తో కలిసి రాత్రి వేళ కుక్కునూరుపల్లికి వచ్చిందని తేల్చారు. అక్కడ ఎస్సై ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడంతో ఆమెకు రాజీవ్ ఎలాంటి వాడో క్లారిటీ వచ్చిందని.. ప్రభాకర్ రెడ్డికి, శ్రవణ్‌కు అతడు సహకరించాడని తెలిసి జీర్ణించుకోలేపోయింది. 
 
రాజీవ్ కూడా తనను వంచించాడని అప్పుడే ఆమె అర్థం చేసుకుంది. సహకారం పేరుతో ఎస్సై ఆలోచనను శిరీష పసిగట్టింది. దీంతో ఆమె కారులో వారితో కలిసి వెళ్లేందుకు కూడా నిరాకరించింది. దీంతో శిరీషపై రాజీవ్, శ్రవణ్ దాడి చేసినట్టు గుర్తించారు. వారి వేధింపులతోనే కారులోంచి శిరీష దూకేసేందుకు ప్రయత్నించింది. అప్పటికీ మళ్లీ ఆమెపై దాడి జరిగింది. 
 
రాజీవ్ లాంటి నయవంచకుడి చేతిలో మోసపోయామని బాధతో.. రాజీవ్ వంచన, శ్రవణ్ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. కాగా, ఈ కేసులో శిరీష, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఈ రెండూ హత్యలేనని, పోలీసులే కేసును పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమిస్తున్నానంది.. రాత్రంతా గడిపేందుకు వచ్చేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

ప్రేమిస్తున్నానని ఆ యువతి చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ...

news

సోషల్ మీడియా రైటర్స్‌ని అరెస్టుచేస్తే.. ఇక దిమ్మ తిరుగుతుంది.. ప్రభుత్వాలను చాచి కొట్టిన సుప్రీంకోర్టు

తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని ...

news

కొంపముంచిన చైనా బామ్మ... దెబ్బకు విమానం ఆగిపోయింది.

నమ్మకాలు, విశ్వాసాలు అనేవి మనుషులకు మాత్రమే పరిమితం చేసుకునేంతవరకు ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. ...

news

అప్పుడు వాన్నా క్రై... ఇప్పుడు పెట్యా..ఏం వైరస్‌లో.. ప్రపంచాన్నే ముంచుతున్నాయి

కనిపించని ప్రాణాంతక వైరస్ మనుషుల్లో దూరితే జరిగే విధ్వంసం సమాజాలనే అతలాకుతలం చేస్తుందని ...

Widgets Magazine