శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 23 నవంబరు 2014 (17:40 IST)

గుంటూరులోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు నగర శివారు ప్రాంతంలో ఉన్న ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరు శివారు ఆటోనగర్లో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
 
అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ దుర్ఘనటలో 80 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.