శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (21:27 IST)

అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు.. ప్రత్యేక రక్షణ చర్యలు

అటవీశాఖలోని వన్యమృగ ప్రాణ సంరక్షణ విభాగం అడవులను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తిరుపతి శేషాచల అడవుల్లోని 200 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రదేశంలో జంతువులను జీవరాశులను కాపాడేందుకు కనీసం 150 మందిని నియమించినట్లు డిఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు.
 
సోమవారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్షులు, చెట్లు, ఔషధమొక్కలు అడవికి నిప్పు పెట్టడంతో సమూలంగా నాశనమవుతున్నాయని అన్నారు. దీంతో ప్రత్యేకంగా రక్షణ కోసం 145 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. వీరు జూన్ 2015 వరకూ పని చేస్తారని చెప్పారు. 
 
తిరుమల కొండల్లోని 108 తీర్థాలకు ఎటువంటి నష్టం లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.