మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శనివారం, 18 ఏప్రియల్ 2015 (08:45 IST)

ఇది తేలిన తరువాతే... సచివాలయ నిర్మాణం

కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నారు... ఒకే అసలు నిర్మాణం చేపట్టదలుచుకున్న స్థలంలో ఉన్న భవనాల పరిస్థితి ఏమిటి? అసలు అవి వారసత్వ సంపది పరిధిలోకి వస్తాయా..? రావా..? అది తేల్చండి. తరువాత దానిని అనుసరించి ఏమి చేయాలనేది ఉంటుందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఆరువారాల్లో కమిటీ ద్వారా నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి. 
 
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రుల ప్రాంగణాన్ని ఎన్నుకుంది. ఇక్కడ ఉన్న ఆసుపత్రిని తరలించాలని భావిస్తోంది. దీనికి చారిత్రక భవనం ఉందని, అందువల్ల కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య హైకోర్టులో  పిల్ దాఖలు చేశారు. 
 
ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ సందర్భంగా ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న భవనాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఆ భవనం జోలికి వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.