గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 25 జూన్ 2016 (13:47 IST)

అమ‌రావ‌తి సీడ్ క్యాపిట్ ర‌హ‌దారి నిర్మాణానికి శ్రీకారం...

అమ‌రావ‌తి: సీడ్ కాపిటల్ ప్రధాన రహదారి నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తిలో ప్ర‌ధాన రహదారి పనులకు ఆయ‌న శ‌నివారం ఉ. 10-50 గంటలకు శంకుస్థాప‌న చేశారు. అక్క‌డే శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు. అమరావతి రాజధానిలో

అమ‌రావ‌తి: సీడ్ కాపిటల్ ప్రధాన రహదారి నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అమ‌రావ‌తిలో ప్ర‌ధాన రహదారి పనులకు ఆయ‌న శ‌నివారం ఉ. 10-50 గంటలకు శంకుస్థాప‌న చేశారు. అక్క‌డే శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్కరించారు. అమరావతి రాజధానిలో నిర్మితమయ్యే 8 ప్రధాన రహదారులలో ఇది అతి పెద్ద రహదారిగా ఇది నిలవనుంది. 
 
తొలిదశలో మొత్తం సుమారు రూ.242.3 కోట్ల అంచనాతో నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారి మార్గం 18.3 కిలోమీటర్ల పొడవున చేప‌డుతున్నారు. ఈ మార్గాన్ని దొండపాడు నుంచి కొండవీటి వాగు అవుట్ సూయిజ్ కలిసే ప్రాంతం వరకు నిర్మించ తలపెట్టారు. ఈ శంకుస్థాప‌న కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పి. నారాయణ, పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు శ్రావణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ప్రధాన ప్రాతం నుంచి ఆరు గ్రామాలను కలుపుతూ ఈ రహదారి నిర్మితం అవుతోంది.