శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : మంగళవారం, 16 మే 2017 (15:36 IST)

తిరుపతిలో ఏరులై పారిన రక్తం... ఎందుకో తెలుసా?

తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్ల

తిరుపతిలో రక్తం ఏరులై పారింది. తలలు వేరుగా ఎగిరిపడ్డాయి. ఒకటి రెండు కాదు వందల తలలు ఎగిరి పడ్డాయి. ఇంత జరుగుతుంటే జనమేం చేస్తున్నారో తెలుసా.. బలులు ఇచ్చేది వారే కాబట్టి. తిరుపతి గంగజాతరలో రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో గంగజాతరకు తరలివచ్చి జంతుబలులు ఇచ్చారు. ఆలయ గోపురం సమీపంలోనే ఈ జంతుబలులు జరిగాయి. 
 
జాతరలో ప్రధానఘట్టం కావడంతో భక్తులు మేకలు, కోళ్ళను నరికి అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. వారంరోజుల పాటు తిరుపతి గంగజాతరలో భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారికి మ్రొక్కులు తీర్చుకున్నారు.