శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (14:12 IST)

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధం!: హైకోర్టు

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధమంటూ పిల్ దాఖలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు 249 రోజులు గడువు కావాలని వార్డుల పునర్విభజన జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం న్యాయ స్థానాన్ని కోరింది. అయితే సోమవారం హైకోర్టులో ఈ ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అంత గడువు ఇవ్వలేమని, అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో రావాలని హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.