శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (09:31 IST)

ఆమె రెండో పెళ్లి చేసుకుంది.. పెంపుడు తండ్రి వేధింపులు.. సెల్‌ఫోన్ వాడొద్దన్నాడు.. అంతే?

స్మార్ట్ ఫోన్ పుణ్యంతో తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని చాలామంది గమనించట్లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లపైనే కన్నేసి వుంచుతున్నారు. పక్కనున్న మనిషిని కూడా కన్నెత్తి చూడట్లేదు. అలా సెల్ ఫోన్‌ను పదే పదే

స్మార్ట్ ఫోన్ పుణ్యంతో తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని చాలామంది గమనించట్లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లపైనే కన్నేసి వుంచుతున్నారు. పక్కనున్న మనిషిని కూడా కన్నెత్తి చూడట్లేదు. అలా సెల్ ఫోన్‌ను పదే పదే వాడొద్దని పెంపుడు తండ్రి తన కుమార్తెను మందలించాడు. కానీ ఆ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిడుదవోలుకు చెందిన నాగమణి భర్త డర్రు నాగరాజు మృతి చెందడంతో విశాఖపట్టణానికి చెందిన ఈగల అప్పలరాజును రెండో వివాహం చేసుకుంది. నాగమణికి అప్పటికే ప్రియబాంధవి (20) అనే కుమార్తె ఉంది. 
 
సోమవారం సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడుతున్న ప్రియబాంధవిని చూసిన పెంపుడు తండ్రి అప్పలరాజు మందలించాడు. దీంతో అడ్డువచ్చిన తల్లి భర్తతో గొడవపడింది. ఇక కాసేపటికే భార్యకు ఫోన్ చేసిన అప్పలరాజు కుమార్తె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయింది.
 
నాగమణి ఇంటికి వచ్చి చూసేసరికి భర్త కనిపించకుండా పోయాడు. దీంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియబాంధవిని అప్పలరాజు తరచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.