బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జులై 2014 (12:20 IST)

జీవో 43ని గౌరవించాల్సిందే, మార్చి 31, 2015వరకు..: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, టూరిస్ట్ బస్సు, మాక్సీ క్యాబ్‌ల నుంచి మోటారు వాహన పన్ను వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ విజయవడకు చెందిన రవాణా ఆపరేటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు 43వ నెంబర్ జీవోకు విరుద్ధంగా ఇరు రాష్ట్రాలు వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య మార్చి 31, 2015 వరకు రవాణా పన్ను వుండదంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇచ్చిన 43వ నంబర్ జీవోను రెండు రాష్ట్రాలూ గౌరవించాల్సిందేని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేసి త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.