శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (17:47 IST)

ఏపీలో గోదావరి పుష్కరాలు : 14న ఉదయం 6:20 గంటలకు ముహూర్తం

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు పండితులు ముహూర్తం ఖరారు చేశారు. శాలివాహన శక మన్మథ నామ సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నెల 14న ఉదయం 6.20 గంటలకు పుష్కర ముహూర్తం మొదలవుతుందని ఏపీ సర్కారు వివరించింది. 
 
ఇకపోతే గురుడు సింహరాశిలో ప్రవేశించిన సందర్భంగా గోదావరి నది పుష్కరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. 25వ తేదీ వరకూ పుష్కరాలు జరుగుతాయి. కాగా 2003 పుష్కరాలు టీడీపీ హయాంలోనే సాగాయి. మళ్లీ 2015 పుష్కరాలను సైతం టీడీపీనే చేతులారా నిర్వహించనుంది. ఇక పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు శరవేగంగా పనుల్ని పూర్తి చేసుకుంటున్నాయి.