బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (01:36 IST)

మంత్రిపదవిని ఆశిస్తే రిటైర్మెంట్ చేయిస్తారా బాబుగారూ... గోలగోల పెడుతున్న గౌతు

మంత్రిపదవులు ఆశించి చివరిక్షణంలో ఘోరంగా భంగపడిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఏడుపులు ఇంకా అగటం లేదు. మిగిలిన ఈ రెండు సంవత్సరాలయినా కాస్త పచ్చగా బతుకుదామని కొండంత ఆశలతో ఉంటే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చి

మంత్రిపదవులు ఆశించి చివరిక్షణంలో ఘోరంగా భంగపడిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల ఏడుపులు ఇంకా అగటం లేదు. మిగిలిన ఈ రెండు సంవత్సరాలయినా కాస్త పచ్చగా బతుకుదామని కొండంత ఆశలతో ఉంటే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా చిదిపివేశారని పదవి రాని నేతలు గోలుగోలున ఏడుస్తున్నారు. ఇలా శోకన్నాలు, రాగాలు పెడుతున్న వారిలో తాజా రాగం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ. 
 
మరి ఆయనే తక్కువ వాడేమీ కాదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒకసారి మంత్రి పనిచేసిన పెద్ద అనుభవం ఆయనది. అలాంటిది కనీసం పేరును కూడా పరిశీలనలోకి తీసుకోకపోతే బాధ ఉండదా మరి. ఆయనకే కాదు. ఆయన కుటుంబం కూడా ఇలా చంద్రబాబు మొండి చేయి చూపడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తండ్రిని ఇంత ఘోరంగా అవమానించినందుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి కూడా గౌతు శివాజీ కుమార్తె శిరీష సిద్ధమయ్యారని వార్తలు రేగాయి 
 
మరోపైవున అంత పెద్ద నేత కూడా తన సీనియారిటీ, నిబద్ధత ఏదీ చంద్రబాబు ముందు పనిచేయనందుగు గౌతు శివాజి విలపిస్తున్నారు. కట్టు తప్పకుండా మొదటినుంచి టీడీపీలోనే కొనసాగుతున్నప్పటికీ తనకు తీవ్ర అన్యాయం చేశారని,  చంద్రబాబు తనను పూర్తిగా విస్మరించారని కంట తడిపెట్టారు. తనకు మంత్రిపదవికి రాకపోతే పోయె, తన ప్రత్యర్ది కళావెంకట్రావుకు పళ్లెంలో పట్టి మరీ మంత్రి పదవి ఇవ్వడం గౌతుకు పుండుమీద కారం చల్లినట్లయింది. 
 
తండ్రి కూతురూ ఇద్దరూ కూడా ఓ ఫైన్ మార్నింగ్ టీడీపీకి టాటా చెప్పి మరోపార్టీ తలుపులు తట్టే అవసాశం ఉందని వార్తలు.