గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (11:13 IST)

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎర్రగడ్డలో.. 100 అంతస్థులతో..!

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎర్రగడ్డలో నిర్మితం కానుంది. ఛాతివ్యాధుల ఆసుపత్రి స్థలంలోకి మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం యోచిస్తోంది. ఆధునాతన వసతులతో దాదాపు వంద అంతస్థులతో భారీ సముదాయాన్ని నిర్మించాక సచివాలయాన్ని అందులోకి మార్చాలని భావిస్తున్నారు.
 
మంత్రులు, అధికారుల నివాసాలను కూడా నిర్మించాలని భావిస్తున్నారు. మిగిలిన స్థలాన్ని స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు అనువైన విశాల మైదానంగా మార్చాలని చూస్తున్నారు. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
కేసీఆర్ ఇటీవలే ఆసుపత్రిని సందర్శించి, స్థలాన్ని పరిశీలించారు. ఛాతి వ్యాధుల ఆసుపత్రి కాలుష్యానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో ఉండాలని, ప్రస్తుతం నగరం నడిమధ్యలో ఉండటం వల్ల కాలుష్యంతో పాటు ఇతర సమస్యలు ఎదురువుతున్నాయని కేసీఆర్ తెలిపారు.