మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (20:16 IST)

ముస్త‌ఫా... ముస్త‌ఫా... నువ్వు కూడా జంపా? సీఎంను క‌లిసిన గుంటూరు వైసీపి ఎమ్మెల్యే ముస్తాఫా

టీడీపీలో ముస్లిం ఎమ్మెల్యే ఒక్క‌రు కూడా లేరు. ఆ లోటును భ‌ర్తీ చేయ‌డానికి అన్న‌ట్లు విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వైసీపీ గోడ దూకి టీడీపీలోకి వ‌చ్చేశారు. అబ్బా! ఈ ప‌ని నేను ముందే చేసుంటే బాగుండేది. మైనారిటీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కేది అని గ

టీడీపీలో ముస్లిం ఎమ్మెల్యే ఒక్క‌రు కూడా లేరు. ఆ లోటును భ‌ర్తీ చేయ‌డానికి అన్న‌ట్లు విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ వైసీపీ గోడ దూకి టీడీపీలోకి వ‌చ్చేశారు. అబ్బా! ఈ ప‌ని నేను ముందే చేసుంటే బాగుండేది. మైనారిటీ కోటాలో మంత్రి ప‌ద‌వి ద‌క్కేది అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫా ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. కానీ, ఆ మాట ఎక్క‌డా బాహాటంగా అన‌లేదు. ఇపుడు టీడీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్న త‌రుణంలో గుంటూరు ఎమ్మెల్యే ముస్త‌ఫా, సీఎం చంద్ర‌బాబును ఇలా క‌ల‌వ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది.
 
పైగా సీఎం వ‌ద్ద మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుతూ ఆయ‌న చేతులు పట్టుకుని అభినందించ‌డం చూస్తే... ఇంకెప్పుడు ముస్త‌ఫా అని సీఎం అడిగిన‌ట్లు... తొంద‌ర‌లోనే ఉంది సార్... అన్న‌ట్లు లేదూ అని గుంటూరు వాసులు గుస‌గుస‌లాడుతున్నారు. వైసీపీ వ‌ర్గాలు అయితే... ముస్త‌ఫా... ముస్త‌ఫా... నువ్వు కూడా జంపా? అని కూనిరాగం తీస్తున్నారు. అయితే, ఇది జాయినింగ్ ఫోటో కాదండీ... గుంటూరులో ఐటిసి స్టార్ హోట‌ల్ క‌డుతున్న నేప‌థ్యంలో సీఎం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా... ఇలా చంద్ర‌బాబును క‌లిసి చిరున‌వ్వులు చిల‌క‌రిస్తున్న దృశ్యం మాత్ర‌మే.