Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాట్రీమోని వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్.. రూ.1.86 లక్షలు మోసం: కిలేడీ అరెస్ట్

గురువారం, 25 జనవరి 2018 (11:26 IST)

Widgets Magazine
arrest logo

వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ల ద్వారా ఎన్నారైలకు గాలం వేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వివాహాలు కుదిర్చే వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫెల్స్ పెట్టి ప్రవాస భారతీయ యువకులకు గాలం వేస్తూ.. ఘరానా మోసాలకు పాల్పడుతున్న దీప అనే యువతిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పరిధిలోని బ్రాడీపేటలో నివాసం ఉండే దీప్తి విలాసాలకు అలవాటు పడి.. తేలికగా డబ్బులు సంపాదించాలనుకుంది. అంతే అడ్డదారిని ఎంచుకుంది. 
 
మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో నకిలీ అకౌంట్లు సృష్టించింది. ఇలా తన నకిలీ అకౌంట్లను సంప్రదించే వారిని మోసం చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణి కుమార్ ఆమెకు పరిచయం అయ్యాడు. అతడిని వివాహం చేసుకుంటానని నమ్మించి.. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి రూ.1.86లక్షలు తీసుకుంది. 
 
ఆపై ఆమె మాటల్లో తేడాను గమనించిన ధరణి.. తన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగాడు. ఎంతకీ ఇవ్వకపోగా.. బెదిరింపులకు దిగింది. దీంతో తాను మోసపోయాననే విషయాన్ని గమనించిన ధరణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపపై గతంలో ఇలాంటి కేసులు చాలానే వచ్చాయని, గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీపను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్టేషన్ లాకప్‌లో కోడి పుంజులు.. తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ...

news

''పద్మావత్''పై నిరసన: స్కూలు బస్సుపై దాడి.. చిన్నారులు భయంతో? (వీడియో)

బాలీవుడ్ సినిమా పద్మావత్ సినిమా ఎన్నో వివాదాల నడుమ గురువారం విడుదల సిద్ధమైంది. అయితే ఈ ...

news

పవన్‌కు నాపై లవ్వెక్కువ : కాంగ్రెస్ నేత వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీహెచ్ పేరును ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ...

news

ఆ దృశ్యాలన్నీ మార్ఫింగ్... నిర్దోషిగా బయటకొస్తా : గజల్ శ్రీనివాస్

తాను ఏ తప్పూ చేయలేదనీ, ఏ ఒక్క అమ్మాయిని లైంగికంగా వేధించలేదనీ ప్రముఖ గజల్ గాయకుడు గజల్ ...

Widgets Magazine