టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:31 IST)

పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు. 

పడక సుఖం కోసం వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యం తాపిన ప్రియురాలు

రాత్రిపూట పడక సుఖం కోసం తన వద్దకు వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యాన్ని ప్రియురాలు ...

నువ్వు ఎంతో కొంటె పులివి.. నువ్వు వద్దంటే ఊకుంటా.... : రాజయ్య రాసలీలలు

తెలంగాణ రాష్ట్రానికి మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య వివాదంలో చిక్కుకున్నారు. ...

ఆగస్టు 15న ఉత్తమ డ్రైవర్ అవార్డ్... కొండగట్టు ప్రమాదంలో మృతి

ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే మాట మనకు తెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డ ...

తిరుమల బ్రహ్మోత్సవాలు... తిరుమలకు నిమిషానికో బస్సు...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు నిమిషానికో బస్సును అందుబాటులోకి ...