గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 31 జనవరి 2015 (23:31 IST)

హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ రికార్డ్... గవర్నర్ రోశయ్య చేతులు మీదుగా....

అంజనీ పుత్రుడు హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన ఘనత ఇది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు తెలియజేశారు. గణపతి సచ్చిదానంద స్వామికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతులమీదుగా గిన్నిస్ బుక్ సర్టిఫికేట్‌ను సచ్చిదానంద స్వామి అందుకున్నారు.