శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (08:59 IST)

యువకుడి వేధింపులు తాళలేక.. ఉరేసుకుని యువతి ఆత్మహత్య

ఎన్నిమార్లు కాదన్నా.. ఆ యువకుడు పదే పదే వెంటాపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ సతాయించాడు. ఫోన్లు, మెస్సేజులు ఇలా ప్రతీ రోజు టార్చర్ పెట్టాడు. ఆ యువతి ఈ అవమానాలను భరించలేకపోయింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. కృష్ణా జిల్లాలో బుధవారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
పెనమలూరు మండలం యనమలకుదురు శివపార్వతీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి మర్రిబోయిన మధుసూదనరావు,వెంకటశైలజలకు తేజశ్రీమానస(16)కుమార్తె ఉంది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరి ఇంటి  సమీపంలో ఈడే శ్రీనివాసరావు కుటుంబం ఉంది. కాగా శ్రీనివాసరావు కుమారుడు రేణుకారావు(19)(నాని) తేజశ్రీమానసతో చనువుగా ఉండేవాడు. అయితే అతను ప్రేమించమని వేధించడంతో ఆమె కొంతకాలంగా దూరంగా ఉంది. అతను మరింత రెచ్చిపోతున్నాడు. 
 
ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడంతో విషయాన్ని బాలిక తల్లి వెంకట శైలజ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో బాలిక వద్ద ఉన్న ఫోన్ తల్లికి ఇచ్చేయగా ఆమెకు కూడా ఫోన్ చేసి మానసను ప్రేమిస్తున్నానంటూ ఫోన్లు చేశాడు. తేజశ్రీమానస తల్లి శైలజ పుట్టినరోజు  కావడంతో దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళతామని కుమార్తె తేజశ్రీమానసను రమ్మని తల్లి కోరింది. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాలు వచ్చిన తరువాత గుడికి వస్తానని చెప్పడంతో తల్లి వెళ్ళిపోయింది. 
 
తల్లి అలా వెళ్ళగానే ఓ సైసైడ్ నోట్ రాసి ఫ్యానుకు ఉరి వేసుకుని తేజశ్రీమానస ఉరి వేసుకుంది. గుడికి వెళ్లిన తిరిగి వచ్చేసరికి  ఇంటి తలుపులు లోపల గడియపెట్టి ఉంది. ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపు తీసి లోనికి వెళ్లి చూడగా వంటగ గదిలో తేజశ్రీమానస చున్నీతో ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని ఉంది. తన చావుకు కారణం ఎవరనే విషయాన్ని సైసైడ్ నోట్ లో స్పష్టంగా పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.