Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. 24 గంటల్లో భారీ వర్షాలు

శనివారం, 17 జూన్ 2017 (11:25 IST)

Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బంగ్లాదేశ్‌ వైపు వెళ్లి బలహీనపడినా రుతుపవనాలకు అనుకూలంగా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం ఉదయం వరకు పాలకోడూరు, అమలాపురంలలో 11, గుడివాడలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర భారతం వైపు రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపారు. అరేబియా సముద్రం నుంచి మాన్‌సూన్‌ కరెంట్‌ బలంగా విస్తరిస్తున్నందున వాతావరణం అనుకూలంగా మారిందన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుంతీదేవి అంతర్గతంపై ఐదు లైన్ల పద్యం.. మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించండి..

కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి ...

news

అత్తమామల వేధింపుల వల్లే భార్యతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్య

అత్తమామల వేధింపుల వల్లే తాను భార్యతో కలిసి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ...

news

అటు పళని, ఇటు పన్నీరు.. ఇద్దరినీ వణికిస్తున్న దినకరన్.. 34 మంది ఎమ్మెల్ల్యేలను తిప్పుకున్నాడే.!

తమిళనాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మరుక్షణంలో ఎడపాడి పళని స్వామి ...

news

ఆహార ధరల సూచీ తగ్గుముఖం పట్టిందా.. మరి ఈ కూర'గాయాలు' మాటేంటి?

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఆహార ధాన్యాల ధరవరల సూచి తగ్గుముఖం ...

Widgets Magazine