గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:24 IST)

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు : ఓ యువతి గల్లంతు!

గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. అమరావతి, నర్సరావుపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది.
 
నల్లపాడు-పేరేచర్ల మధ్య రైల్వేట్రాక్‌ కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తాటికొండలో కొండవీటివాగు ఉగ్రరూపం దాల్చింది. కొండవీటివాగులో ఓ యువతి గల్లతైంది. 
 
ప్రత్తిపాడులో చెరువు పొంగి పక్కనేవున్న ఎస్సీకాలనీలోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి.