శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 30 జూన్ 2016 (21:29 IST)

విశాఖ‌లో భారీ వ‌ర్షాల‌కు అధికారులు అల‌ర్ట్!

విశాఖ‌: విశాఖప‌ట్నం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపద్యంలో యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచనల ప్రకారం మరో 48 గంటల వరకూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రానున్న మ

విశాఖ‌: విశాఖప‌ట్నం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపద్యంలో యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచనల ప్రకారం మరో 48 గంటల వరకూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రానున్న మూడు రోజుల్లో  భారీగా వర్షాలు పడతాయని చెబుతున్నారని తెలిపారు. గురువారం ఉదయం వరకూ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. అయినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, మండల కేంద్రాల్లో తహసిల్దార్లు, ఎంపీడీవోలు ఉండాలని ఆదేశించామన్నారు. 
 
నిత్యం ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గండ్లు పడటానికి అవకాశం ఉన్న చెరువులు, కాల్వ గట్ల పరిస్థితిని నిశితంగా గమనించాలని మండల స్థాయి యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. అన్ని చౌక దుకాణాల్లో రేషను సరకులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రజలకు వాటిని అందిస్తామన్నారు. గురువారం ఉదయం నుంచి కలెక్టరేట్‌, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో నియంత్రణ గదులను ఏర్పాటు చేస్తామని చెప్పారు.