Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోలు పగిలింది - రోహిణి కార్తె నానుడి నిజమైంది .. చల్లటి నీరు, మజ్జిగ, రాగిజావ తీసుకోండి

శనివారం, 20 మే 2017 (10:28 IST)

Widgets Magazine
rolu

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అంటారు మన పెద్దలు. ఈ నానుడి నిజమైంది. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట పంచాయతీ కొత్తపల్లిలో భానుడి దెబ్బకు ఓ రోలు మూడు ముక్కలైంది. దీంతో రోహిణి కార్తె నానుడి నిజమైంది. ఈ కార్తె ప్రవేశించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాస్తున్న ఎండలకు ప్రజలు భీతిల్లిపోతున్నారు. కేవలం ఎండలు కాయడమే కాకుండా రోడ్డుపై వెళ్లే వాహనాలు సైతం నిలువునా తగలబడిపోతున్నాయి. అలాగే, వేడిగాలులు వీస్తున్నాయి. 
 
ఈ ఎండల వేడిమికి తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల వరకు ఈ వడగాడ్పుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చల్లటి నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. 
 
అలాగే తరచూ చల్లని మజ్జిగ తాగడం మంచిదని తెలిపింది. రాగిజావను అల్పాహారంగా తీసుకోవాలని చెప్పింది. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, నీడపట్టున ఉండటం ద్వారా వడగాడ్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఎండల్లోకి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ కొజ్జా : ఎమ్మెల్సీ కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు

అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఓ నపుంసకుడు అని అదే ...

news

ఎమ్మెల్యే - ఎమ్మెల్యీ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు.. ఇద్దరి హత్య

ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఉన్న వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా.. అద్దంకి ...

news

క్యాన్సర్‌ చంపలేదు... ఆస్తి కోసం నా భర్తే చంపేశాడు : తల్లి సుమశ్రీ

నా కుమార్తెను క్యాన్సర్ చంపలేదని ఆస్తి కోసమే నా భర్త చంపేశాడని ఇటీవల క్యాన్సర్ వ్యాధితో ...

news

తెలంగాణ-ఏపి మధ్య వివాదాల్లేవు... కానీ సెక్షన్ 108 పొడిగించాల్సిందే... కాల్వ, పరకాల

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని సమాచార శాఖ మంత్రి కాలవ ...

Widgets Magazine