గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:31 IST)

విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు : చంద్రబాబు

విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందని బాబు తెలియజేశారు. ఏపీలో నిరంతర విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. 
 
ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అందించారు. అక్టోబర్ 2 నుండి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అమల్లోకి రానుంది. 8 ఎంవోయులపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది.
 
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సమర్థుడు, ఆదర్శప్రాయుడు అన్నారు. ప్రతిపాదించిన 50 రోజుల్లోనే ప్రాజెక్టులను ఓకే చేయించుకున్నారన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్రానికి నిరంతర విద్యుత్ ఇస్తామన్నారు.
 
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందన్నారు. విద్యుత్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో పీయూష్ గోయల్ సహకారం మరువలేమన్నారు. గతంలో క్రిసెంట్ రేటింగులో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ లోటును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.