శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (02:45 IST)

మూడేళ్ల పసిపాపలపై అత్యాచారాలు.. వాళ్లూ బట్టలు సరిగా వేసుకోలేదా: స్నేహ ఆవేదన

అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎక్కడికి వెళ్లాలి ఎవరితో వెళ్లాలి అనేవి చెబుతున్న పెద్దమనుషులు మన ఘనమైన దేశంలో మూడేళ్ల పసిపిల్లలపై జరుగుతున్న అత్యచారాలకు కూడా వారే కారణం అని నిందిస్తారా అంటూ నటి స్నేహ నిలదీశారు.

అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎక్కడికి వెళ్లాలి ఎవరితో వెళ్లాలి అనేవి చెబుతున్న పెద్దమనుషులు మన ఘనమైన దేశంలో మూడేళ్ల పసిపిల్లలపై జరుగుతున్న అత్యచారాలకు కూడా వారే కారణం అని నిందిస్తారా అంటూ నటి స్నేహ నిలదీశారు. సంప్రదాయాల గురించి సొల్లు కార్చేవారు మూడేళ్ల పసిపాపలు, ఏడేళ్ల చిన్నారులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిపి చెత్తబుట్టల్లో పడేయడం కూడా సంప్రదాయంలో భాగంగానే భావిస్తున్నారా అని ఛీత్కరించారు.  ఏం జరుగుతుందో కూడా వాళ్ల ఊహకు తెలీని పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే. ఇలాంటి అకృత్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు అని స్నేహ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటి భావన, వరలక్ష్మీలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో స్నేహ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అయింది.
 
‘‘మహిళలను దేవతలుగా కొలిచిన నేలపై ఇన్ని దారుణాలా! అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది నిర్భయ, నందినీలకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. మాకు కావలసింది న్యాయం, గౌరవం. దయచేసి ఈ దారుణాలను ఆపండి’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు నటి స్నేహ. మహిళలకు మద్దతుగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు. భావన, వరలక్ష్మీలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఆమె ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది
 
నా సహచర నటీమణులు భావన, వరలక్ష్మీలకు ఎదురైన అనుభవాలను తలచుకుంటుంటే నా మనసు తీవ్రంగా ఆవేదన చెందుతోంది. మనస్ఫూర్తిగా వాళ్లకు నా మద్దతు తెలుపుతున్నాను. ధైర్యంగా వాళ్లు మాట్లాడిన తీరుని ప్రశంసిస్తున్నాను. ఇటువంటి ఘటనల గురించి ఓపెన్‌గా హ్యాండిల్‌ చేసిన విధానంలో వాళ్ల  పరిణతి కనిపిస్తోంది.
 
ఇంకెన్నాళ్లీ ప్రేక్షక పాత్ర
మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అవమానాలు... ప్రతి రోజూ సమాజంలో ఏ మూలన చూసినా ఇటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. చాలామంది బాధిత మహిళలు తమ మనసులో మాటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్లూ ఓ భాగమైన ఈ సమాజమే కారణం. ఇటువంటి దురాగతాలు జరిగినప్పుడు ఎక్కువగా అమ్మాయిలనే నిందిస్తున్నారు. నైతిక విలువలు, సంప్రదాయ పరిరక్షణకు పాటుబడుతున్నామని ప్రచారం చేసుకునేవాళ్లు... అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎక్కడికి వెళ్లాలి ఎవరితో వెళ్లాలి అనేవి చెబుతారు. 
 
ఈ సందర్భంగా నేను వాళ్లను ఒకటి అడగాలనుకుంటున్నాను. మూడేళ్ల పసిపాపలు, ఏడేళ్ల చిన్నారులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిపి చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఏం జరుగుతుందో కూడా వాళ్ల ఊహకు తెలీదు. ఇలాంటి అకృత్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు. ఇంకెన్నాళ్లు ప్రేక్షక పాత్ర పోషిస్తారు ఓ మై గాడ్‌! హృదయ విదారకరమైన ఫొటోలు చూస్తుంటే, నా మనసు ముక్కలవుతోంది. ఓ తల్లిగా ఆ చిన్నారుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలను.
 
తప్పు ఎక్కడ జరిగింది ‘మదర్‌ ఇండియా’గా, దేశాన్ని అమ్మగా పిలవబడే రాజ్యంలో ఏం జరుగుతోంది  జీవనదులకు మహిళల పేర్లు పెడతారు. దేవుడితో సమానంగా దేవతలను పూజిస్తారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ‘దేవుడు తనలో సగభాగాన్ని అర్ధాంగికి ఇచ్చాడు’ అని చెబుతారు. ఓ ఆడదాని కారణంగా రాజ్యం రావణకాష్టంలా తగలబడిందనే కథలు విన్నాము. మహిళలను చాలా విధాలుగా కొలిచే దేశం ఇది. కానీ, మహిళలు గర్వంగా తలెత్తుకుని, హుందాగా గౌరవంతో బతికే రోజులు పోయాయి. ఇప్పుడీ మాట చెబితే ఎప్పుడో గడిచిన గతంలా ధ్వనిస్తుంది. వాట్‌ ఎ షేమ్‌!!