శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (06:02 IST)

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కుమారుడు శ్యాంబాబును ఎవరు కాపాడుతున్నారు? నిలదీసిన హైకోర్టు

హంద్రీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి ఆరా తీసింది. ఆ పెద్దమనిషి సంగతేమిటంటూ శ్యాంబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతని గురించి ప్రభుత్వ న్యాయ

హంద్రీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుపై వచ్చిన ఆరోపణలపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి ఆరా తీసింది. ఆ పెద్దమనిషి సంగతేమిటంటూ శ్యాంబాబు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతని గురించి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఆయన సమాధానాన్ని దాట వేయడంతో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరు ఏం చేసినా ప్రశ్నించకూడదా చట్టా నికన్నా అధికులమని వీరంతా భావిస్తున్నారు. వాళ్లు చేస్తున్నదాన్ని మీరు (ప్రభుత్వం) సమర్థించుకోవచ్చు. అంతమాత్రాన వాస్తవం మరుగునపడిపోదు. 
 
ఇసుక తవ్వకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే కిలో మీటర్ల మేర బాట వేస్తుంటే మీరేం (అధికారులు) చేస్తున్నారు’ అంటూ నిలదీసింది. చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి, రవాణా చేసిన వారిపై ఎంతమందికి రూ.లక్ష జరిమానా విధించారు ఎన్ని ట్రాక్ట్టర్లు సీజ్‌ చేశారు ఎంతమంది హైకోర్టుకొచ్చి స్టేలు తెచ్చుకున్నారు తదితర వివరాలను తమ ముందుంచాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిం చింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
 
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హంద్రీ నదిలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించు కోవడంలేదని, ఫలితంగా సమీప గ్రామాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నా యంటూ కృష్ణగిరి, కోడుమూరు మండలా ల పరిధిలోని ఎస్‌హెచ్‌ ఎర్రగుడి, మన్నేకుం ట గ్రామస్తులు ఎ.బజారీ మరో 11 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.   మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.