శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (12:20 IST)

మీకెందుకు అంతతొందర.. టీఎస్ సర్కారు హైకోర్టు చీవాట్లు.. వీసీల నియామకం రద్దు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు అక్షింతలు వేసింది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంపై టీఎస్ సర్కారు అనుసరించిన వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు అక్షింతలు వేసింది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకంపై టీఎస్ సర్కారు అనుసరించిన వైఖరిని హైకోర్టు తప్పుబట్టింది. అంతేనా.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామకాన్ని కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
అసలు కేసు విచారణ దశలో ఉండగా వీసీల నియామంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటూ నిలదీశింది. దీంతో వీసీలను నియమిస్తూ జారీ అయిన జీవోను కోర్టు కొట్టివేసింది. అర్హతల ఆధారంగా నియామకాలు జరపాలని హైకోర్టు సూచించింది. 
 
అదేసమయంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి వినతి మేరకు తీర్పు అమలును హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. 2 రోజుల క్రితం 9 మంది వీసీలను టీఎస్‌ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.