శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 24 మే 2015 (13:38 IST)

అర పూటకి 60 మంది మృతి... నీడలోనే ఉండమంటున్న అధికారులు

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఎండలు మండిపోతుండడంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే తెలుగు రాష్ట్రాలలో 60 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయని, తీర ప్రాంతాల్లో వేడిగాలుల వల్ల ఎండలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఆదివారం మధ్యహ్నానం ఆదిలాబాద్‌లో 48 డిగ్రీలు, నిజామాబాద్ లో 47.6 డిగ్రీలు, మచిలీపట్నంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని చోట్లా సాధారణం కంటే 3 నుంచి 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకూ ప్రజలు నీడలోనే ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్త పడాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.