శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (11:53 IST)

సొంతగడ్డపై తొలి పద్దు... ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్థిక లోటు రూ.23,054 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఏపీ రాష్ట్ర తొలి పద్దును సొంతగడ్డపై త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2017-18 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఏపీ రాష్ట్ర తొలి పద్దును సొంతగడ్డపై తొలిసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్ధుడైన చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. 
 
విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ఏపీ ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ప్రతిబింభించే బడ్జెట్ ఇదని ఆయన చెప్పారు. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన సందర్భంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల అన్నారు. కాగా, యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హైలెట్స్‌, వివిధ శాఖలకు కేటాయింపులను అంకెల్లో పరిశీలిస్తే... 
 
రాష్ట్ర మొత్తం బడ్జెట్‌ : రూ.1,56,999 కోట్లు 
రెవెన్యూ వ్యయం : రూ.1,25,912 కోట్లు
క్యాపిటల్ వ్యయం : రూ.31,087 కోట్లు
ఆర్థిక లోటు : రూ.23,054 కోట్లు
రెవెన్యూ లోటు : రూ.416 కోట్లు
 
వివిధ శాఖల కేటాయింపులు 
హోంశాఖ : రూ.5,221 కోట్లు
రోడ్లు, భవనాలశాఖ : రూ.4,041 కోట్లు
నిరుద్యోగ భృతి : రూ.500 కోట్లు
విద్యుత్‌ శాఖ : రూ.4,311 కోట్లు
పురపాలక శాఖ : రూ.5,207 కోట్లు
జలవనరుల శాఖ : రూ.12,770 కోట్లు
ప్రైవరీ విద్యకు : రూ.17,197 కోట్లు
హైయ్యర్ ఎడ్యుకేషన్‌కు : రూ.3513 కోట్లు
పంచాయతీరాజ్‌శాఖ : రూ.6562 కోట్లు
ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి : రూ.100 కోట్లు
గృహ నిర్మాణశాఖ : రూ.1457 కోట్లు
పౌరసరఫరాలశాఖ : రూ.2800 కోట్లు
ఎన్టీఆర్‌ క్యాంటీన్ల పథకం : రూ.200 కోట్లు
ఎన్టీఆర్‌ వైద్య సేవ : రూ.1000 కోట్లు
గ్రామీణ రహదారులు : రూ.262 కోట్లు
రైతు రుణమాఫీ : రూ.3600 కోట్లు
ఐటీశాఖ రూ.364 కోట్లు
అటవీశాఖ- రూ.383 కోట్లు
మత్స్యశాఖ- రూ.282 కోట్లు
పశుగణాభివృద్ధి రూ.1,112 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.19,567 కోట్లు
పరిశ్రమలశాఖ రూ.2,086 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.10 వేల కోట్లు
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.75 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
రాష్ట్ర క్రైస్తవ కార్పొరేషన్‌కు రూ.35 కోట్లు
రహదారుల నిర్వహణకు రూ.1102 కోట్లు 
మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు
రాజధాని ప్రాంత అభివృద్ధికి రూ.1,061 కోట్లు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం రూ.9,747 కోట్లు
డ్వాక్రా సంఘాలకు రుణాలు : రూ.1600 కోట్లు
చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.125 కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ : రూ.7021 కోట్లు
అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనానికి రూ.97 కోట్లు