శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (20:58 IST)

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగి పడ్డ కొండ చెరియలు..

తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చెరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డు అడ్డంగా పడిపోయాయి.  కాసేపు వాహనాలు ఆగి పోయాయి. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వాటిని తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గురువారం సాయంత్రం తిరుమల రెండో ఘాట్ రోడ్డు ( తిరుమలకు వెళ్ళే దారి ) ఏడు కిలోమీటరు వద్ద ఎత్తైన కనుమలు ఉన్నాయి. వాటి పక్కనే వాహనాలలో ప్రయాణం చేయాల్సి ఉంది. గత 15 రోజులుగా తిరుమల వాతావరణంలో చాలా మార్పులు ఉన్నాయి. ప్రతీ రోజు వర్షం కురుస్తూనే ఉంది. నాలుగు రోజుల కిందట రెండు రోజుల పాటు జడివాన కురిసింది. చాలా కాలంగా వర్షాలు లేక ఎండి పోయిన బండరాళ్ల మధ్య నున్న మట్టి వర్షానికి కొట్టుకుపోయింది.
 
దీంతో గురువారం సాయంత్రం దాదాపు మీటరు వ్యాసార్థం ఉన్న బండరాళ్ళు నాలుగు విరిగి రోడ్డు మీద పడ్డాయి. అదృష్టం కొద్ది సమీపంలో వాహనాలు లేవు కాబట్టి ప్రమాదం తప్పిపోయింది. పడిన వెంటనే రోడ్డున పోయే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిబ్బందిని అక్కడకు పంపి బండరాళ్ళను పక్కకు తోసి తిరుమలకు వాహనాలను అనుమతించారు.